Raviteja: 'ధమాకా' డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇచ్చిన మాస్ మహారాజ్!

Raviteja in Nakkina Trinatha Rao Movie
  • నక్కిన త్రినాథరావు నుంచి వచ్చిన 'ధమాకా'
  • రవితేజకి మాస్ హిట్ ఇచ్చిన సినిమా ఇది
  •  ఆయన నుంచి మరో ఛాన్స్ అందుకున్న నక్కిన 
  • నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు 
  • కథానాయికగా తెరపైకి కీర్తి సురేశ్ పేరు

రవితేజ తనకి హిట్ ఇచ్చిన దర్శకులకు మరో ఛాన్స్ ఇస్తూ వెళుతున్నాడు. ఇంతకుముందు కూడా ఆయన ఇదే పద్ధతిని ఫాలో అవుతూ వచ్చినవాడే. 'డాన్ శీను' .. 'బలుపు' .. 'క్రాక్' ఇలా రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వరుస సినిమాలు రావడానికి కారణం ఇదే. ఈ మూడు సినిమాలతో వీళ్లు హ్యాట్రిక్ అందుకున్నారు.

అందువల్లనే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి మరోసారి సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీలను తీసుకోవడం విశేషం. 'ధమాకా' తరువాత ఈ ఇద్దరూ కలిసి నటించే సినిమా ఇది. ఇక 'ధమాకా'తో మాస్ హిట్ ఇచ్చిన నక్కిన త్రినాథ రావుకి రవితేజ మరో ఛాన్స్ ఇచ్చాడు. 

ఈ సినిమాకి కథ ... మాటలు త్రినాథరావు సిద్ధం చేసుకున్నారట. ఆల్రెడీ ఆయన రవితేజకి కథను వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తాడని సమాచారం. ఇక కథానాయికగా ఎవరిని తీసుకుంటారనేది చూడాలి. బయటమాత్రం కీర్తి సురేశ్ ను తీసుకునే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది.

  • Loading...

More Telugu News