Sobhita Dhulipala: వ్యక్తిగత జీవితంపై పుకార్లకు బాధపడను: శోభిత ధూళిపాళ్ల

Sobhita Dhulipala says she is not bothered about chatter on personal life
  • వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం ఇష్టం లేదన్న శోభిత
  • తన నటనపై మాట్లాడొచ్చని వెల్లడి
  • తనను అర్థం చేసుకునే వాడు భర్తగా కావాలన్న నటి

పొన్నియన్ సెల్వన్ లో చివరిసారిగా కనిపించిన శోభిత ధూళిపాళ్ల తదుపరి నైట్ మేనేజర్ పార్ట్ 2తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో న్యూస్18 మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రముఖ నటుడు నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలపై ప్రశ్న ఎదుర్కొంది. ఈ సందర్భంగా చెబుతూ, తన వ్యక్తిగత జీవితంపై అనవసర వాగుడుని తాను పట్టించుకోనని బదులిచ్చింది. అసలు ఏముందని బాధ పడడానికి? అంటూ ప్రశ్నించింది. 

‘‘నేను ఇది చెప్పకపోతే దీనిపై ప్రజలు తెలుసుకోవడానికి అవకాశమే ఉండదు. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ప్రతి దశలోనూ ఎంతో కష్టపడ్డాను. మీరు నన్ను చూడాలనుకుంటే, లేదా నా గురించి తెలుసుకోవాలంటే నా ప్రతిభను చూడాలని కోరతాను. నా శ్రమను చూడాలని కోరతాను. అది నాకు ఎంతో అమూల్యమైనది. అంతే కానీ, వారు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం ఏమిటి?’’ అని శోభిత చెప్పింది. 

తన నటన గురించి మాట్లాడాలే కానీ, తన వ్యక్తిగత జీవితంలోకి చూడొద్దని శోభిత ఒక విధంగా అభిమానులను కోరినట్టయింది. ఎలాంటి జీవిత భాగస్వామి కావాలన్న ప్రశ్నకు.. ఒదిగి ఉండే వాడు తనకు కావాలంది. తనకు నన్నిహితంగా ఉంటూ, అర్థం చేసుకునేవాడు కావాలని తెలిపింది.

  • Loading...

More Telugu News