జగన్ అహంకారానికి ఫుల్‌స్టాప్ పక్కా.. ధూళిపాళ్ల నరేంద్ర
- మార్గదర్శి విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించబోవన్న టీడీపీ నేత
- ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా షాకవుతున్నారన్న నరేంద్ర
- జగన్ అహంకారం త్వరలోనే కూలుతుందని హెచ్చరిక
ప్రశ్నించే వారిపై కక్ష పెంచుకుంటున్న ప్రభుత్వాన్ని చూసి ఆలిండియా సర్వీసు అధికారులు కూడా షాకవుతున్నారని అన్నారు. మార్గదర్శిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్న ప్రభుత్వ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని ధూళిపాళ్ల దుయ్యబట్టారు.