Gaddar: కొత్త పార్టీ పెడుతున్న గద్దర్... పార్టీ పేరు ఇదే!

Gaddar launching his new political party
  • 'గద్దర్ ప్రజా పార్టీ' పేరుతో గద్దర్ సొంత పార్టీ
  • రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ
  • పార్టీ జెండాలో మూడు రంగులు, పిడికిలి గుర్తు ఉండే అవకాశం

తూటాల వంటి పాటలతో ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని రగిలించిన, ప్రజాగాయకుడు గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. రాజకీయ పార్టీని స్థాపించి, చట్ట సభల ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు అడుగులు వేస్తున్నారు. తన పార్టీకి 'గద్దర్ ప్రజాపార్టీ' అని నామకరణం చేశారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. 

గద్దర్ ప్రజా పార్టీ జెండాలో మూడు రంగులు, మధ్యలో పిడికిలి ఉండబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా గద్దర్, కార్యదర్శిగా నరేశ్, కోశాధికారిగా గద్దర్ భార్య నాగలక్ష్మి వ్యవహరించబోతున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత గద్దర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.

  • Loading...

More Telugu News