Titanic Ship: వారు బతికే ఉన్నారు.. గల్లంతైన సబ్‌మెరైన్ నుంచి సిగ్నల్స్!

Likely Signs Of Life On Missing Titanic Sub With 5 Aboard
  • టైటానిక్ శిథిలాలు చూసేందుకు వెళ్లి గల్లంతైన మినీ జలాంతర్గామి
  • దాని ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్న శోధన బృందాలు
  • ప్రతి అరగంటకు ఒకసారి క్రమం తప్పకుండా నీటి అడుగు నుంచి బ్యాంజింగ్ సౌండ్స్
  • సబ్‌మెర్సిబుల్‌లో మరో 30 గంటలకు సరిపడా మాత్రమే ఆక్సిజన్
అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శకలాలు చూసేందుకు వెళ్లి గల్లంతైన మినీ జలాంతర్గామి ఆచూకీని గుర్తించినట్టు తెలుస్తోంది. అందులో ఉన్న ఐదుగురు కూడా ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. గల్లంతైన సబ్‌మెర్సిబుల్ నౌకను వెతికేందుకు రంగంలోకి దిగిన సెర్చ్ వెహికల్‌ ప్రతి 30 నిమిషాలకు ఒకసారి క్రమం తప్పకుండా  వస్తున్న ‘బ్యాంజింగ్ సౌండ్స్’ను గుర్తించింది. దీంతో ఆ సబ్‌మెర్సిబుల్ సురక్షితంగానే ఉందని, అందులోని వారు ప్రాణాలతోనే ఉన్నారని భావిస్తున్నారు. అయితే, ఆ శబ్దాలు ఎంత దూరం నుంచి వస్తున్నాయన్న విషయాన్ని మాత్రం కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. 

బ్యాంజింగ్ సౌండ్స్ నౌక సురక్షితంగా ఉందన్న దానికి సంకేతాలని భావిస్తున్నారు. సోనార్‌ పరికరాలతో శోధిస్తున్న బృందాలు కూడా నీటి లోపలి నుంచి వస్తున్న బ్యాంజింగ్ సౌండ్స్‌ను గుర్తించాయి. మరోవైపు, సహాయక చర్యల కోసం రంగంలోకి దిగిన కెనడియన్ పీ-3 ఎయిర్‌క్రాఫ్ట్ కూడా నీటి అడుగు నుంచి వస్తున్న శబ్దాలను గుర్తించి ఆ వివరాలను అమెరికా నేవీ నిపుణులతో పంచుకుంది. కాగా, గల్లంతైన మినీ జలాంతర్గామిలో మరో 30 గంటలకు సరిపడా మాత్రమే ఆక్సిజన్ ఉండడంతో ఆందోళన మొదలైంది. వీలైనంత త్వరగా నౌకను గుర్తించి అందులోని వారిని రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
Titanic Ship
Banging sounds
North Atlantic Ocean
Titanic wreckage
Submersible

More Telugu News