Bride: ప్రధాని పేరు తెలియదన్నాడని పెళ్లి రద్దు చేసుకొని.. అతని తమ్ముడిని చేసుకున్న యువతి

Bride cancels her marriage with groom as he does not know the name of the PM
  • ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో వింత ఘటన
  • ఈ నెల 11న శివశంకర్ అనే వ్యక్తితో రంజనకు వివాహం
  • ఆ పెళ్లి వద్దని మరుసటి రోజే అతని తమ్ముడితో పెళ్లి  
మన దేశ ప్రధాన మంత్రి పేరు తెలియకపోవడం ఓ వ్యక్తి పెళ్లికి ఎసరొచ్చింది. భారత ప్రధాని ఎవరు? అని వధువు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన సదరు వరుడి పెళ్లి కేన్సిల్ అయింది. ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపుర్ జిల్లాలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శివ శంకర్ అనే వ్యక్తితో రంజన అనే యువతి పెళ్లి ఈనెల 11న జరిగింది. 

ఆ మరుసటి రోజు ఉదయం పెళ్లి వేడుకల్లో భాగంగా వధువు ఇంట్లో చిన్న కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రంజన చెల్లెలు, ఆమె సోదరుడితో మాటలు వరుడు కలిపాడు. ఈ సందర్భంగా దేశ ప్రధాని ఎవరని రంజన సోదరి శివ శంకర్ ను ప్రశ్నించింది. దీనికి శివ శంకర్ సమాధానం చెప్పలేకపోవడంతో పక్కనే ఉన్న బంధువులు అతడిని హేళన చేశారు. ఇదంతా చూసిన వధువు రంజన అవమానంగా భావించింది. శివ శంకర్ తో పెళ్లిని రద్దు చేసుకొని అక్కడికక్కడే అతని తమ్ముడైన అనంత్ ను పెళ్లి చేసుకుంది.
Bride
groom
marriage
Uttar Pradesh
Prime Minister

More Telugu News