Pawan Kalyan: మెగా ప్రిన్సెస్ కు ఆశీస్సులు అందించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes Ram Charan and Upasana on their first child
  • తొలి సంతానానికి స్వాగతం పలికిన రామ్ చరణ్-ఉపాసన
  • నేడు ఆడశిశువుకు జన్మనిచ్చిన ఉపాసన
  • రామ్ చరణ్-ఉపాసన దంపతులపై శుభాకాంక్షలు వెల్లువ
  • ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ తొలి సంతానానికి నేడు స్వాగతం పలికారు. ఉపాసన ఇవాళ ఉదయం హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చారు. తొలిసారి తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసన దంపతులపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

తాజాగా, రామ్ చరణ్ బాబాయి, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఆశీస్సులు అందజేశారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించిన తరుణాన ప్రేమపూర్వక శుభాకాంక్షలు... శుభాశీస్సులు అంటూ పవన్ ఓ ప్రకటన చేశారు. 

మెగా ఇంట కొత్త కుటుంబ సభ్యురాలు వచ్చిన సందర్భంగా అత్యంత సంతోషకర వాతావరణం నెలకొంది. రామ్ చరణ్, ఉపాసన 2012 జూన్ 14న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే ఇరువురు పెళ్లిరోజు జరుపుకున్నారు.
Pawan Kalyan
Ram Charan
Upasana
Baby

More Telugu News