Kannababu: సబ్జెక్ట్ లేకపోతేనే ఇలాంటి మాటలు వస్తాయి: పవన్ కల్యాణ్ పై కన్నబాబు విమర్శలు

Kannababu slams Pawan Kalyan
  • కాకినాడలో పవన్ వ్యాఖ్యల దుమారం
  • మండిపడుతున్న వైసీపీ నేతలు
  • చంద్రబాబు కూడా ఇలా ఎప్పుడూ మాట్లాడలేదన్న కన్నబాబు
  • సభ్యత లేని భాషతో పవన్ ఎమ్మెల్యే ద్వారంపూడిపై మాట్లాడారని ఆగ్రహం
వారాహి యాత్రలో తమపై దుమ్మెత్తిపోస్తున్న పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా, కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూడా పవన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. 

సబ్జెక్ట్ లేనప్పుడే ఇలాంటి మాటలు  వస్తాయని అన్నారు. పవన్ చేస్తున్నంత వ్యక్తిగత దూషణలు చంద్రబాబు కూడా ఎప్పుడూ చేయలేదని తెలిపారు. సభ్యత, సంస్కారం లేని భాషతో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై మాట్లాడారని కన్నబాబు మండిపడ్డారు. 

వారాహి యాత్రలో పవన్ హావభావాలు సినిమాటిగ్గా ఉన్నాయని, ఈ యాత్ర అభిమానులను అలరించేందుకేనని తెలిపారు. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే కాకినాడలో ద్వారంపూడిపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. 

గతంలో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు చిరంజీవి వస్తే అప్పటి టీడీపీ ప్రభుత్వం అడ్డుకుందని, ప్రశ్నిస్తాను అని చెప్పే పవన్ కల్యాణ్ అప్పుడెందుకు ప్రశ్నించలేదని కన్నబాబు నిలదీశారు.
Kannababu
Pawan Kalyan
Dwarampudi Chandrasekhar Reddy
Kakinada
YSRCP

More Telugu News