adipurush: వరుస వివాదాలు.. మళ్లీ కెలుక్కున్న ‘ఆదిపురుష్’ రచయిత!

bajrangbali bhagwaan nahi says adipurush writer manoj muntashir
  • హనుమంతుడు అసలు దేవుడే కాదన్న మనోజ్ శుక్లా
  • కేవలం రాముడి భక్తుడు మాత్రమేనని సంచలన వ్యాఖ్యలు
  • శక్తులు వచ్చాయి కాబట్టి.. హనుమంతుడిని దేవుడిని చేశామని వెల్లడి
వరుస వివాదాలు ‘ఆదిపురుష్’ సినిమాను చుట్టుముడుతున్నాయి. ఇవి చాలవన్నట్లు కొత్తవి సృష్టిస్తున్నారు ఆ సినిమా రచయిత మనోజ్ శుక్లా. చిత్రంలోని డైలాగ్స్ విషయంలో తీవ్ర విమర్శలపాలైన ఈయన.. తాము తీసింది రామాయణమే కాదని మొన్న చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో.. హనుమంతుడు అసలు దేవుడే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదిపురుష్ మూవీలో హనుమంతుడి డైలాగ్స్ విషయంపై ఓ జాతీయ చానెల్ లో మాట్లాడుతూ.. హనుమంతుడు అసలు దేవుడే కాదని, ఆయన భక్తుడు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ‘‘హనుమంతుడు శ్రీరాముడిలా మాట్లాడడు. తాత్వికంగా మాట్లాడడు. ఆయన భగవంతుడు కాదు.. భక్తుడు. రాముడికి హనుమంతుడు వీర భక్తుడు. అంతేకానీ దేవుడు కాదు’’ అని అన్నారు.

మనోజ్ శుక్లా అంతటితో ఆగలేదు.. ‘‘హనుమంతుడి భక్తికి శక్తులు వచ్చాయి కాబట్టి.. ఆయన్ను మనం దేవుడిని చేశాం’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి డైలాగ్స్ లో తప్పేముందీ అంటూ సమర్థించుకున్నారు. ఈయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.
adipurush
manoj muntashir
bajrangbali bhagwaan nahi
hanuman
Prabhas
Om Raut

More Telugu News