Bhanuchandar: హాయిగా చనిపోయినవాడే అసలైన కోటీశ్వరుడు: భానుచందర్

Bhanuchandar Interview
  • ఆరోగ్యమే ప్రధానమని చెప్పిన భానుచందర్ 
  • మనశ్శాంతికి మించిన సంపద లేదని వ్యాఖ్య 
  • మంచంలో పడకూదని వెల్లడి 
  • నిద్రలోపోయే వాళ్లు అదృష్టవంతులన్న భానుచందర్  

భానుచందర్ .. ఒకప్పుడు యాక్షన్ హీరోగా ఒక ఊపు ఊపేసిన హీరో. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో నడిచే కథల్లో ఆయనే అసలైన నాయకుడు. అలాంటి భానుచందర్ ఎప్పుడు చూసినా చాలా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. భగవంతుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు .. దానిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. ఇక ఎవరి జీవితంలోనైనా ప్రారంభం కంటే ముగింపు ముఖ్యమైనదని ఆయన అంటూ ఉంటారు. 

తాజా ఇంటర్వ్యూలో భానుచందర్ మాట్లాడుతూ .. "భగవంతుడు నీకు అన్నీ ఇచ్చాడు .. ఇంకా ఏం ఇవ్వలేదని నువ్వు బాధపడాలి. జీవితం చాలా చిన్నది .. ఈ కాసేపటికి ఇన్ని బాధలు పడుతూ కూర్చోవడం అవసరమా? మనశ్శాంతి ఉన్నవాడు గొప్పవాడు .. హాయిగా చనిపోయినవాడు అసలైన శ్రీమంతుడు" అని అన్నారు. 

 "జీవితంలో మనం ఎన్నో ప్లాన్ చేసుకుంటూ ఉంటాము .. కానీ మనల్ని తీసుకెళ్లే ఆయన మనలను చూసి నవ్వుకుంటూ ఉంటాడు. కోట్లు సంపాదించేసి .. మంచంలో పడిపోయి .. ఎప్పుడు పోతాడ్రా అని అందరూ ఎదురుచూసేవరకూ ఉండకూడదు. నా ఫ్రెండ్ ప్రతాప్ పోతన్ మాదిరిగా నిద్రలో పోవాలంతే. బ్రతికినన్నాళ్లు మనశ్శాంతితో బ్రతకడం .. మనకి తెలియకుండానే మనం పోవడం" అంటూ చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News