Chandrababu: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చంద్రబాబు శుభాకాంక్షలు

Chandrababu greetings to ABN Radhakrishna
  • వేమూరి రాధాకృష్ణ జన్మదినం నేడు
  • ఒత్తిళ్లకు, స్వార్థ ప్రయోజనాలకు తలవంచని వ్యక్తి అని చంద్రబాబు కితాబు
  • ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పత్రిక అని నిరూపిస్తున్నారని ప్రశంస
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఎలాంటి ఒత్తిళ్లకు, స్వార్థ ప్రయోజనాలకు తలవంచకుండా... నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచుతూ... ప్రజలకు అసలైన పాత్రికేయ ప్రయోజనాలను అందిస్తూ... ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పత్రిక అని నిరూపిస్తున్న రాధాకృష్ణగారికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులను మీరు ఘనంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.
Chandrababu
Telugudesam
ABN Radhakrishna

More Telugu News