Naresh: ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాలివే!

  • ఈ నెల 23న ఓటీటీ సినిమాల సందడి
  •  సోనీ లివ్ లో 'ఏజెంట్' స్ట్రీమింగ్
  •  'ఆహా' వేదికపై 'మళ్లీ పెళ్లి'
  • అదే ఫ్లాట్ ఫామ్ పైకి 'ఇంటింటి రామాయణం'
OTT Movies

రీసెంట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి 'బిచ్చగాడు 2' .. 'అన్నీ మంచి శకునములే' సినిమాలు వచ్చాయి. థియేటర్స్ నుంచి అంతంత మాత్రంగా రెస్పాన్స్ తెచ్చుకున్న 'అన్నీ మంచి శకునములే' సినిమాకి ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. ఇక 'బిచ్చగాడు 2' సినిమాను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనేలేదు. 

ఇక ఈ శుక్రవారం కూడా ఓటీటీ సెంటర్స్ లో సందడి కాస్త గట్టిగానే కనిపిస్తోంది. ఈ నెల 23వ తేదీన సోనీ లివ్ లో 'ఏజెంట్' సినిమా స్ట్రీమింగ్ కానుంది. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి రూపొందించిన సినిమా ఇది. సాక్షి వైద్య కథానాయికగా పరిచయమైన ఈ సినిమా, తొలిరోజునే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. 

'ఇంటింటి రామాయణం' .. 'మళ్లీ పెళ్లి' సినిమాలు రెండూ కూడా ఈ నెల 23వ తేదీనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మే 26వ తేదీన థియేటర్లకు వచ్చిన 'మళ్లీ పెళ్లి' .. జూన్ 9న వచ్చిన 'ఇంటింటి రామాయణం' ఈ రెండు కూడా 'ఆహా' ఫ్లాట్ ఫామ్ ద్వారా పలకరించనున్నాయి. ఈ రెండు సినిమాలు నరేశ్ ప్రధానమైన పాత్రగా కొనసాగుతాయి.

More Telugu News