రూ. 50 దొంగిలించాడన్న అనుమానం.. టోల్‌ప్లాజా గార్డును కొట్టిచంపేసిన వైనం.. వీడియో ఇదిగో!
- బీహార్‌లో టోల్‌ప్లాజా గార్డుగా పనిచేస్తున్న యూపీ వాసి
- దాడి తర్వాత రైలులో ఇంటికి పంపిన వైనం
- రైల్లోనే క్షీణించిన ఆరోగ్యం
- ఆసుపత్రిలో చేర్చిన రైల్వే పోలీసులు
- చికిత్స పొందుతూ మృతి
టోల్‌ప్లాజాలో దొంగతనానికి పాల్పడ్డాడన్న అనుమానంతో దుండగుల మూక అతడిని తీవ్రంగా కొట్టింది. తీవ్రంగా గాయపడిన బల్వంత్ సింగ్ ఆ తర్వాత తన సొంతూరికి వెళ్లాడు. ఆ వెంటనే మరణించాడు. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌కు అనుకూలంగా మాట్లాడినందుకు హర్యానాకు చెందిన బౌన్సర్లే ఈ దాడికి పాల్పడినట్టు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కేసు నమోదు చేసుకున్న గోండా పోలీసులు నిందితుల కోసం టోల్‌ప్లాజాపై దాడిచేసినట్టు గోండా ఎస్పీ ఆకాశ్ తోమర్ తెలిపారు. దాడి తర్వాత టోల్ ప్లాజా సిబ్బంది బాధితుడిని ట్రైన్‌లో సొంతూరికి పంపినట్టు పోలీసులు తెలిపారు. రైలులో ఆరోగ్యం క్షీణించడంతో గోండా జిల్లాలోని మన్కాపూర్ స్టేషన్‌లో దింపేసిన రైల్వే పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.