Chiranjeevi: మెగా ప్రిన్సెస్ కు స్వాగతం: చిరంజీవి

Welcome to little Mega Princess tweets Chiranjeevi
  • మరోసారి తాత అయిన చిరంజీవి
  • పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన
  • నీ రాక ఆనందంగా, గర్వంగా ఉందంటూ మనవరాలి గురించి చిరు ట్వీట్
మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చిరంజీవి మరోసారి తాత అయ్యారు. రామ్ చరణ్ భార్య ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. తనకు మనవరాలు పుట్టిన ఆనందాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 'లిటిల్ మెగా ప్రిన్సెస్'కు స్వాగతం అంటూ చిరు ట్వీట్ చేశారు. హార్ట్ సింబల్స్ తో తన మనవరాలిపై ప్రేమను కురిపించారు. నీ రాకతో లక్షలాది మందితో కూడిన మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపావని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నీ రాక ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని అని అన్నారు.
Chiranjeevi
Grand Daughter
Ramcharan
Upasana
Tollywood

More Telugu News