Ramcharan: మెగా ఇంట సంబరాలు.. అమ్మానాన్నలైన రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు

Ram Charan Upasana blessed with baby girl
  • నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన
  • తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి ప్రకటన
  • మెగా ఇంట మిన్నంటిన సంబరాలు, యువరాణి వచ్చిందంటూ మెగా ఫ్యామిలీ ప్రకటన
  • నేటి ఉదయం తల్లీబిడ్డలను చూసేందుకు వెళ్లనున్న ఇరు కుటుంబాలు

మెగా కుటుంబం, మెగాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన క్షణం రానే వచ్చింది. రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు అయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. 

బిడ్డ పుట్టడంతో అటు మెగా, ఇటు కామినేని కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. రామ్‌చరణ్ తన కూతురిని చూసి మురిసిపోయారని ఆయన సన్నిహితులు చెప్పారు. మెగా ప్రిన్సెస్ పుట్టిందంటూ మెగా ఫ్యామిలీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరు కుటుంబాల సభ్యులు నేటి ఉదయం 7 గంటలకు ఆసుపత్రికి వెళ్లి రామ్ చరణ్-ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, బిడ్డను ఆశీర్వదిస్తారని తెలిపింది. 

2012లో రామ్‌చరణ్ ఉపాసనల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నట్టు మెగా, కామినేని కుటుంబాలు గతేడాది నవంబర్ 12న వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితమే ఉపాసన సీమంతం ఘనంగా నిర్వహించారు. ఇక పెళ్లయిన నాటి నుంచీ అత్తమామలతోనే ఉంటున్న రామ్‌చరణ్, ఉపాసన తాము గత కొంత కాలంగా విడిగా ఉంటున్నామని ఇటీవల ప్రకటించారు. అయితే, బిడ్డ పుట్టాక మళ్లీ అత్తామామలతోనే ఉంటామని కూడా పేర్కొన్నారు. తమ ఎదుగుదలలో గ్రాండ్ పేరెంట్స్ కీలక పాత్ర పోషించారని, ఇలాంటి ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయదలుచుకోలేదని పేర్కొన్నారు. 
f

  • Loading...

More Telugu News