hardik pandya: వదిన లక్ష రూపాయలు అడిగితే.. ఐదు లక్షలిస్తానన్న హార్దిక్ పాండ్యా

Pandyas Wedding Video To Natasha Stankovic Goes Viral
  • పాండ్యా పెళ్లి వేడుకలో ఆసక్తికర సన్నివేశం
  • పాండ్యా షూస్ దాచిపెట్టిన వదిన ఫాంకురి శర్మ
  • డబ్బు ట్రాన్సఫర్ చేశాకే షూస్ ఇస్తానని ఆటపట్టించిన వదినమ్మ

టీమిండియా ఆల్ రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ ఏడాది ఫిబ్రవరి 14న హిందూ సంప్రదాయం, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం నటాషాను మరోసారి పెళ్లి చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో 2020 లాక్ డౌన్ సమయంలోనే వీరు రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. అప్పటికే నటాషా గర్భవతి. 2020 జులై నెలలో నటాషా మగబిడ్డకు జన్మనిచ్చింది. తొలుత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని, ఫిబ్రవరిలో బంధువులు, ఆత్మీయుల సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

ఈ వేడుకలో భాగంగా పాండ్యా వదిన ఫాంకురి శర్మ పాదరక్షలు దాచిపెట్టడం పేరుతో పాండ్యా షూస్ దాచి పెట్టింది. రూ.1 లక్ష ఇస్తేనే షూక్ ఇస్తానని ఆటపట్టించింది. వదిన రూ.1 లక్ష అడగడంతో స్పందించిన పాండ్యా లక్ష కాదు.. ఐదు లక్షలు ఇస్తానని వదినతో అన్నాడు. వెంటనే ఆ డబ్బును పంపించాలని పక్కనున్న బంధువులకు చెప్పాడు. అయినప్పటికీ ఫాంకురి పాండ్యాను ఆటపట్టించడం ఆపలేదు. డబ్బు ట్రాన్సఫర్ చేశాకే షూ ఇస్తానని చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News