Chandrababu: బాలుడు అమర్నాథ్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించిన చంద్రబాబు

Chandrababu handed over financial help to murdered boy Amarnath family members
  • బాపట్ల జిల్లాలో బాలుడు అమర్నాథ్ దారుణ హత్య
  • అక్కను వేధిస్తున్న ఆకతాయిలను ఎదిరించిన అమర్నాథ్
  • పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతకులు
  • నేడు బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు
తన సోదరిని వేధిస్తున్న ఆకతాయిలను ఎదిరించి వారి చేతిలో సజీవ దహనమైన బాపట్ల జిల్లా బాలుడు అమర్నాథ్ కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఆర్థికసాయం అందించారు. రేపల్లె నియోజకవర్గం ఉప్పలవారిపాలెంలో అమర్నాథ్ అనే పదో తరగతి బాలుడు దారుణ హత్యకు గురికావడం రాష్ట్రంలో అందరినీ కలచివేసింది. 

ఇవాళ ఉప్పలవారిపాలెం వచ్చిన చంద్రబాబు... బాలుడు అమర్నాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి టీడీపీ తరఫున రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా, అమర్నాథ్ హత్య వివరాలను కుటుంబ సభ్యులు చంద్రబాబుకు వివరించారు. 

చంద్రబాబు రాకతో అమర్నాథ్ కుటుంబ సభ్యులు భావోద్వేగాలకు లోనయ్యారు. వారు చెప్పిన వివరాలతో చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి పరిస్థితి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు.
Chandrababu
Amarnath
Murder
Bapatla District
TDP

More Telugu News