Upasana: రేపు బిడ్డకు జన్మనివ్వనున్న ఉపాసన!

Upasana will give birth to a child tomorrow
  • తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్-ఉపాసన
  • జూన్ 20న ఉపాసనకు డెలివరీ డేట్
  • మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు
మెగాస్టార్ చిరంజీవి నివాసంలో మూడోతరం రాకకు రేపు శుభముహూర్తమని తెలుస్తోంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు రేపు (జూన్ 20) తమ తొలి సంతానాన్ని స్వాగతించనున్నారు. ఉపాసన మంగళవారం నాడు బిడ్డకు జన్మనివ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ  మేరకు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు.  

రామ్ చరణ్, ఉపాసన ఇటీవల పెళ్లిరోజు జరుపుకున్నారు. ఈ జోడీ 2012 జూన్ 14న పెళ్లితో ఒక్కటయ్యారు. ఇన్నాళ్లకు తొలి బిడ్డకు జన్మనిస్తూ తల్లిదండ్రుల హోదా అందుకోబోతున్నారు. ఉపాసన గర్భవతి అని తెలిసినప్పటి నుంచే మెగా ఫ్యామిలీలో సంతోషం ఉప్పొంగుతోంది.
Upasana
Child
Birth
Ramcharan
Mega
Tollywood

More Telugu News