rythu bandhu: ఈ నెల 26 నుండి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు

Rythu Bandhu from June 26 in farmers account
  • వానాకాలం పంట పెట్టుబ‌డి కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నిధుల జ‌మ 
  • త్వ‌ర‌లో పోడు భూముల‌కు ప‌ట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
  • పంపిణీ తర్వాత పోడు రైతులకూ రైతుబంధు సాయం
తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఈ నెల 26వ తేదీ నుండి రైతుబంధు నిధులు విడుద‌ల చేయాలని నిర్ణయించింది. వానాకాలం పంట పెట్టుబ‌డి కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జ‌మ కానున్నాయి. త్వ‌ర‌లో పోడు భూముల‌కు ప‌ట్టాలు పంపిణీ చేయాల‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు. ప‌ట్టాల పంపిణీ అనంత‌రం పోడు రైతుల‌కు కూడా రైతుబంధు సాయం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.
rythu bandhu
Telangana
KCR

More Telugu News