సినిమా ఫీల్డ్ లో పవన్ కల్యాణ్ చిట్టా అంతా నా దగ్గరుంది... బాగుండదని చెప్పడంలేదు: ద్వారంపూడి
- కాకినాడలో పవన్ కల్యాణ్ వర్సెస్ ద్వారంపూడి
- గతరాత్రి తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
- తాను కూడా సినిమా రంగానికి చెందినవాడ్నే అన్న ద్వారంపూడి
- తమ థియేటర్లలో పవన్ సినిమాలు ఆడించామని వెల్లడి
- ఆ విషయం అల్లు అరవింద్ కు బాగా తెలుసని వివరణ
తాను కూడా సినిమా రంగానికి చెందినవాడ్నేనని, తాను సినీ ఎగ్జిబిటర్ నని ద్వారంపూడి వెల్లడించారు. తమకు సినిమా హాళ్లు ఉన్నాయని, చిరంజీవి, పవన్ కల్యాణ్ ల సినిమాలు ఎక్కువగా తమ థియేటర్ కాంప్లెక్స్ లలోనే ఆడాయని వివరించారు. ఈ విషయం పవన్ కల్యాణ్ కు తెలియకపోవచ్చు... అల్లు అరవింద్ కు బాగా తెలుసు అని ద్వారంపూడి పేర్కొన్నారు.
కాకినాడలోని దేవి-శ్రీదేవి, చాణక్య- చంద్రగుప్త థియేటర్లలో పవన్ కల్యాణ్ సినిమాలు ఆడించామని తెలిపారు. "నా గురించి అతనికి తెలియకపోవచ్చు కానీ... అతని గురించి నాకు బాగా తెలుసు. సినిమా ఫీల్డ్ లో నాకు కూడా చాలామంది ఉన్నారు. అతని చిట్టా త్వరలోనే నేను విప్పుతా" అని పేర్కొన్నారు.