Perni Nani: సొల్లు కబుర్లు చెబుతున్నాడు: పవన్ కల్యాణ్ పై పేర్ని నాని మండిపాటు

perni nani says death threat to pawan kalyan by chandrababu naidu
  • చంద్రబాబు వల్లే పవన్ కు ప్రాణహాని ఉందన్న పేర్ని నాని
  • పవన్‌ది రౌడీ మనస్తత్వమని విమర్శ
  • జగన్‌ను ఎదుర్కోవడం ఆయన వల్ల కాదని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తనకు ప్రాణహాని ఉందంటూ సొల్లు కబుర్లు చెబుతున్నాడని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మరి ప్రాణహాని ఉంటే ఏనాడైనా పోలీసులకు చెప్పారా? అని ప్రశ్నించారు. ఆయనకు చంద్రబాబు వల్లే ప్రాణహాని ఉందని అన్నారు. పవన్‌ సినిమాల్లో తప్ప, తన దగ్గర పనిచేసే సిబ్బందిని తప్ప బయట ఎవడినీ కొట్టలేరని ఎద్దేవా చేశారు.

సోమవారం మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ.. అరాచకంగా పాలించిన చంద్రబాబుని ఏనాడైనా పవన్‌ కొట్టారా? అని నిలదీశారు. ‘‘నారా లోకేశ్ అవినీతిపరుడని గతంలో పవన్‌ కల్యాణ్‌ ఆరోపించలేదా? మరి లోకేశ్ ను గుడ్డలిప్పి కొట్టగలిగాడా?’’ అని ప్రశ్నించారు. పవన్‌ది రౌడీ మనస్తత్వమని, అందుకే అలా మాట్లాడుతున్నారని పేర్ని నాని విమర్శించారు.

చంద్రబాబుతో పొత్తు అనగానే పవన్‌ వెనకాల కాపులు తిరగడం మానేశారని చెప్పారు. సీఎం అవుతానంటూ.. కాపులను మోసం చేయడం కోసమే పవన్‌ అంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు చంద్రబాబుతో పవన్‌ కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. సీఎం జగన్‌ను ఎదుర్కోవడం పవన్‌ వల్ల కాదన్నారు.
Perni Nani
Pawan Kalyan
Chandrababu
Jagan
Janasena
YSRCP
TDP

More Telugu News