Chaitanya Rao: 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' విడుదల తేదీ ఖరారు!

  • విభిన్నమైన కథాంశంతో 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో'
  • చెందు ముద్దు దర్శకత్వంలో రూపొందిన సినిమా 
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ 
  • జులై 21వ తేదీన సినిమా విడుదల
Annapurna Photo Studio release date confirmed

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకి మంచి ఆదరణ లభిస్తోంది. కంటెంట్ కొత్తగా .. ఆసక్తికరంగా అనిపిస్తే చాలు, మిగతా విషయాలను గురించి ఆడియన్స్ అంతగా పట్టించుకోవడం లేదు. తమకి కంటెంట్ నచ్చితే భారీ వసూళ్లను ముట్టజెప్పడానికి ఎంతమాత్రం వెనుకాడటం లేదు. ఈ విషయాన్ని ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు మరోసారి నిరూపించాయి. 

ఇప్పుడు అదే దారిలో ప్రేక్షకులను పలకరించడానికి 'అన్నపూర్ణ స్టూడియో' రెడీ అవుతోంది. చైతన్యరావు - లావణ్య లక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా విడుదల తేదీని కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ సినిమాను జులై 21వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రిన్స్ హెన్రి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. 

ఒకప్పుడు గ్రామాలకు దగ్గరలోని టౌన్లలో ఉన్న ఫొటో స్టూడియోలకు మంచి డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీనిని బట్టి ఈ కథ ఏ కాలంలో నుడుస్తుంది? ఫొటో స్టూడియో చుట్టూ తిరిగే ఆ కథ ఎలాంటిది? అనేది ఆసక్తికరం. యశ్ రంగినేని నిర్మిస్తున్న ఈ సినిమాకి, చెందు ముద్దు దర్శకత్వం వహించాడు.

More Telugu News