brave shopkeeper: షాపులోకి చొరబడిన దొంగ.. బయట పడలేక అవస్థ

How a brave shopkeeper in UK trapped a robber inside his shop VEDIO
  • తెలివిగా స్పందించిన షాపు నిర్వాహకుడు
  • కత్తితో బెదిరించినా భయపడకుండా తెలివిగా పన్నాగం
  • వేగంగా బయటకు వెళ్లి షట్టర్ మూత
క్లిష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు యుక్తితో ఎదుర్కోవాలి. ఓ షాపు యజమాని అలానే చేశాడు. షాపులోకి చొరబడిన దొంగను అడ్డంగా బుక్ చేశాడు. ఈ ఘటన బ్రిటన్ లో జరిగింది. దుర్హామ్ పట్టణంలోని ఓ షాపులోకి పొడవాటి కత్తితో మాల్కామ్ ట్రింబ్లే అనే వ్యక్తి ప్రవేశించాడు. గ్లాస్ డోర్ తోసుకుని లోపలికి చొరబడ్డాడు. షాప్ నిర్వాహకుడిని బెదిరించాడు. దొంగ మాటలకు షాప్ యజమాని భయపడిపోలేదు. ప్రశాంతంగానే మాటలు కలిపాడు. 

అలా మాట్లాడుతూ క్యాష్ కౌంటర్ నుంచి బయటకు వచ్చాడు. వేగంగా గ్లాస్ డోర్ తీసుకుని బయటకు వెళ్లి దాన్ని లాక్ చేయబోయాడు. దొంగ కూడా వేగంగా పరుగు తీసి గ్లాస్ డోర్ ను లోపలి వైపు నుంచి పట్టుకుని బలంగా లాగాడు. కొన్ని సెకన్ల తర్వాత గ్లాస్ డోర్ తెరుచుకుంది. అప్పటికే షాపు నిర్వాహకుడు బయట షట్టర్ ను క్లోజ్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో దొంగ షట్టర్ కిందకు దూరాడు. శరీరంలో సగభాగం షట్టర్ బయటకు వెళ్లగా, మిగతా సగభాగం షాపులోపలి వైపునే ఉండిపోయింది. దీంతో షట్టర్ కిందే అతడు చిక్కుకుపోయాడు. పోలీసులు వచ్చి అతడికి సంకెళ్లు వేసి తీసుకెళ్లి కోర్టులో హాజరు పరిచారు, నేరం అంగీకరించడంతో మూడేళ్ల నాలుగు నెలల జైలు శిక్ష పడింది. 



brave shopkeeper
UK
robber
trapped
inside shop

More Telugu News