New Delhi: మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ అవడంలో జాప్యం.. కుమారుడిని కత్తితో పొడిచిన తండ్రి

Father stabs son over delay in downloading mobile ap
  • గురుగ్రామ్‌లో వెలుగు చూసిన ఘటన
  • చెల్లింపుల కోసం మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ చేయమని భార్యకు చెప్పిన భర్త
  • డౌన్‌లోడింగ్‌లో ఆలస్యం జరుగుతుండటంతో భార్యతో గొడవ
  • మధ్యలో కల్పించుకున్న కుమారుడిపై కత్తితో దాడి
  • బాధితుడికి ఆసుపత్రిలో చికిత్స, అనంతరం డిశ్చార్జ్
  • నిందితుడిపై పోలీసులు కేసు నమోదు
మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ అవడంలో జాప్యం జరుగుతుండటంతో భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి, అడ్డొచ్చిన కొడుకును కత్తితో పొడిచాడు. దేశరాజధాని ఢిల్లీలో ఈ దారుణం వెలుగు చూసింది. అశోక్ సింగ్(64) ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో సీనియర్ మేనేజర్‌గా చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన కుమారుడు ఆదిత్య(23) కంప్యూటర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అశోక్ ఇటీవలే గురుగ్రామ్‌లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. 

ఈ క్రమంలో చెల్లింపుల కోసం మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ చేయాలని భార్యకు చెప్పాడు. కానీ డౌన్‌లోడింగ్‌లో జాప్యం జరుగుతుండటంతో అసహనానికి లోనైన ఆయన భార్యతో గొడవకు దిగారు. ఈ క్రమంలో తనకు అడ్డుపడ్డ కొడుకును కత్తితో పొడిచాడు. ఫలితంగా, ఆదిత్యను ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. గాయాలకు చికిత్స చేసిన అనంతరం వైద్యులు అతడిని డిశ్చార్జ్ చేశారు. కాగా, పోలీసులు నిందితుడు అశోక్‌పై సెక్షన్ 324(మారణాయుధంతో కావాలని దాడికి దిగడం) కింద కేసు నమోదు చేశారు.
New Delhi
Crime News

More Telugu News