adipurush: ఆదిపురుష్ సినిమా చిత్రబృందంపై ఉద్దవ్ శివసేన వర్గం ఎంపీ ప్రియాంక ఆగ్రహం

Team Uddhav Shreds Adipurush Makers
  • చిత్రంలో అమర్యాదకరమైన సంభాషణలంటూ ఆగ్రహం
  • చిత్రబృందం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్
  • బాక్సాఫీస్ కోసం హద్దులు దాటడం సరికాదని వ్యాఖ్య

ఆదిపురుష్ చిత్ర బృందంపై ఉద్దవ్ థాకరే వర్గం శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రంలో అమర్యాదకరమైన సంభాషణలు ఉపయోగించినందుకు గాను చిత్రబృందం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు.

పేలవమైన సంభాషణలు, హనుమంతుడి డైలాగ్స్ విషయంలో ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా, దర్శకుడు ఓం రౌత్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. వినోదం పేరుతో మనం పూజించే దేవుళ్లకు ఇలాంటి భాషను వినియోగించడం భారతీయుడి మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. మర్యాద పురుషోత్తముడైన రాముడిపై సినిమా తీసి, బాక్సాఫీస్ విజయం కోసం మర్యాదకు సంబంధించిన అన్ని హద్దులు దాటి వేయడం సరికాదన్నారు.

  • Loading...

More Telugu News