JD Chakravarthi: విషప్రయోగం వలన చనిపోతాననుకున్నాను .. ఎమోషనలైన జేడీ చక్రవర్తి!

JD Chakravarthi Interview
  • తాజాగా ఒక సీక్రెట్ బయటపెట్టిన జేడీ 
  • ఆరోగ్యపరంగా తాను పడిన ఇబ్బంది గురించి ప్రస్తావన
  • 8 నెలలుగా కషాయంలో పాయిజన్ కలిపి ఇచ్చారని వెల్లడి 
  • చనిపోతానని అనుకున్నానంటూ ఎమోషనల్
జేడీ చక్రవర్తి ఎప్పుడు చూసినా చాలా యాక్టివ్ గా ఉంటాడు. మంచి సమయస్ఫూర్తి ఉన్న వ్యక్తి కూడా. తనకి ఏది తోస్తే అది చేస్తుంటాడు .. ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి జేడీ తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. కొంతకాలం క్రితం తనపై విషప్రయోగం జరిగిందని చెప్పాడు.

"నాకు స్లో పాయిజన్ ఇచ్చిన మాట వాస్తవం .. కాకపోతే ఎవరు అనేది చెప్పను .. ఆడా .. మగా అనేది కూడా చెప్పను. నేను నాకు వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాను. అలాంటి పరిస్థితుల్లో నెమ్మదిగా నాకు బ్రీతింగ్ ప్రోబ్లం వచ్చింది. అది పెరుగుతూ వెళ్లడం మొదలైంది. ఇక నా పని అయిపోయిందని అనుకున్నాను. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని కూడా డాక్టర్లకు చెప్పాను" అని అన్నాడు.

" ఈ సమస్యకి ఇక్కడ పరిష్కారం దొరకలేదు .. దాంతో విదేశాలలో కూడా చూపించుకున్నాను. అయినా సమస్య ఏమిటనేది తేలలేదు. ఈ అనారోగ్య సమస్య తలెత్తక ముందు నేను హెల్దీగా ఉండటం కోసం ఒక కషాయం తాగుతూ ఉండేవాడిని. ఒక వ్యక్తి దానిని తయారుచేసి నాకు పంపించేవాడు. ఒకసారి నాతో పాటు ఆ కషాయం తాగిన వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. ఆ కషాయంలోనే ఎనిమిది నెలలుగా పాయిజన్ కలుపుతూ వచ్చారనే విషయం చివర్లో తేలింది" అంటూ చెప్పుకొచ్చాడు.   
JD Chakravarthi
Actor
Tollywood

More Telugu News