anjali: గేమ్ ఛేంజర్లో ‘ఆఫీసర్’గా అంజలి

Anjali first look from Game changer
  • గేమ్ ఛేంజర్ నుంచి అంజలి ఫస్ట్ లుక్ విడుదల
  • రామ్ చరణ్–శంకర్ చిత్రంలో తెలుగమ్మాయి కీలక పాత్ర
  • హీరోయిన్‌ గా నటిస్తున్న కియారా
  • దిల్ రాజు నిర్మాతగా వస్తున్న సినిమా

‘షాపింగ్ మాల్’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన అచ్చ తెలుగు హీరోయిన్ అంజలి ముందుగా తమిళంలో తనను తాను నిరూపించుకొని టాలీవుడ్‌ లో అడుగు పెట్టింది. వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. తన సహజమైన నటనతో  నాయికా ప్రాధాన్యత ఉన్న చిత్రాలతోనూ ఆకట్టుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ చిత్రంలో కీలక పాత్రలో అద్భుతమైన నటన చూపెట్టిన అంజలిని తెలుగులో ఇప్పుడు మరో భారీ ఆఫర్ వరించింది. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌‌ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అంజలి పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమాలో ఆమె పోస్టర్ ను విడుదల చేసింది. నల్లరంగు సూట్ దరించి, కళ్ల జోడు పెట్టుకొని, చేతిలో ఫైల్ తో మెట్లు ఎక్కుతున్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో అంజలి ఓ అధికారి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా ఆద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది.

  • Loading...

More Telugu News