KTR: మా సీఎం అభ్యర్థి కేటీఆర్.. మరి మీకో.. కాంగ్రెస్, బీజేపీలను నిలదీసిన మంత్రి పువ్వాడ

Our CM Candidate Is KTR Who Yours Minister Puvvada Asks Congress and BJP
  • ఖమ్మంలో పట్టణ ప్రగతి కార్యక్రమం
  • కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ది చెందుతోందన్న మంత్రి
  • కేటీఆర్ పాలనా దక్షత అద్భుతమని కొనియాడిన పువ్వాడ

బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమకు కేటీఆర్ ఉన్నారని, మరి మీకు ఎవరున్నారని కాంగ్రెస్, బీజేపీలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రశ్నించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిన్న ఖమ్మంలో పట్టణ ప్రగతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి నగర పాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో కేంద్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. మంత్రి కేటీఆర్ పాలనా దక్షత అద్భుతమని కొనియాడారు. ఆయన వల్లే మున్సిపల్ పాలనలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ‘సఫాయి అన్న-సఫాయి అమ్మ’ విగ్రహాలను మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News