TTD: సెప్టెంబరు నెలకు సంబంధించిన సేవా టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనున్న టీటీడీ

  • ఈ నెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
  • జూన్ 21 వరకు లక్కీడిప్ కు అవకాశం
  • జూన్ 22న వివిధ సేవలు, పవిత్రోత్సవాల టికెట్ల విడుదల
  • మధ్యాహ్నం 3 గంటలకు దర్శన టికెట్ల విడుదల
TTD set to release Seva tickets for the month of September

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సెప్టెంబరు నెల శ్రీవారి సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ నెల 19న తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది. 

సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన, ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు ఈ నెల 19 నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో భక్తులు లక్కీడిప్ కోసం తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. 

ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనున్నారు. అదే రోజున ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను కూడా విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. అదే రోజున (జూన్ 22) ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవాల టికెట్లను కూడా ఆన్ లైన్ లో ఉంచనున్నారు. ఈ నెల 23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. 

More Telugu News