Mallu Bhatti Vikramarka: భట్టి విక్ర‌మార్కకు రాహుల్ గాంధీ ఫోన్.. పాదయాత్రపై ఆరా!

congress leader rahul gandhi calls bhatti vikramarka
  • ‘పీపుల్ మార్చ్’ పేరుతో తెలంగాణలో భ‌ట్టి విక్ర‌మార్క పాదయాత్ర
  • మార్చి 16 నుంచి ఇప్పటిదాకా 1,000 కిలోమీటర్లకు పైగా నడక
  • భట్టికి ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాహుల్

తెలంగాణలో ‘పీపుల్ మార్చ్’ పేరుతో కాంగ్రెస్ నేత భ‌ట్టి విక్ర‌మార్క పాదయాత్ర సాగిస్తున్నారు. మార్చి 16న యాత్ర చేప‌ట్టిన ఆయన.. 500కు పైగా గ్రామాలు, 30కి పైగా నియోజకవర్గాల మీదుగా వెయ్యి కిలో మీటర్లకు పైగా నడిచారు. ఈ నేపథ్యంలో జూన్ 15న పుట్టిన రోజు జరుపుకున్న ఆయనకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నుంచి ఫోన్ వచ్చింది. 

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. భట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పాదయాత్ర గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఆయనకు కాంగ్రెస్ పార్టీ మొత్తం అండగా ఉంటుందని రాహుల్ చెప్పినట్లు సమాచారం. మరోవైపు భట్టి పుట్టినరోజు నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో పాదయాత్రకు విరామం ప్రకటించారు. నల్గొండ మండలం జి.చెన్నారంలో ఉన్న భట్టి.. శనివారం ఉదయం తిరిగి పాదయాత్ర కొనసాగించనున్నారు.

  • Loading...

More Telugu News