Hyderabad: హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుంది: విద్యాసాగర్ రావు

Hyderabad will become second capital of India says Vidyasagar Rao
  • హైదరాబాద్ రెండో రాజధాని కావాలని అంబేద్కర్ చెప్పారన్న విద్యాసాగర్ రావు
  • బొల్లారం, సికింద్రాబాద్, హైదరాబాద్ లను కలిపి ఒక స్టేట్ చేయాలని చెప్పారని వెల్లడి
  • హైదరాబాద్ రెండో క్యాపిటల్ కావడం దేశ భద్రతకు మంచిదని పేర్కొన్నారని వ్యాఖ్య
హైదరాబాద్ నగరం మన దేశానికి రెండో రాజధాని అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. దేశానికి రెండో రాజధాని అయ్యే అవకాశం హైదరాబాద్ కు ఉందని ఆయన అన్నారు. రాజ్యాంగంలో కూడా ఇదే అంశం ఉందని చెప్పారు. స్మాల్ స్టేట్స్ అనే పుస్తకంలో కూడా అంబేద్కర్ ఈ విషయాన్ని రాశారని తెలిపారు. 

బొల్లారం, సికింద్రాబాద్, హైదరాబాద్ లను కలిపి ఒక స్టేట్ గా చేసి, దాన్ని దేశ రెండో క్యాపిటల్ చేయాలని అంబేద్కర్ చెప్పారని అన్నారు. హైదరాబాద్ రెండో క్యాపిటల్ కావడం మన దేశ భద్రతకు మంచిదని పేర్కొన్నారని తెలిపారు. పాకిస్థాన్, చైనాలకు హైదరాబాద్ ఎంత దూరంలో ఉందనే విషయాన్ని కూడా వివరించారని అన్నారు. హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందనే నమ్మకం తనకు కూడా ఉందని చెప్పారు. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. 

మన దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పారు. మోదీ మళ్లీ ప్రధాని అయితే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని.. ఏదైనా సమస్య ఉంటే హైకమాండ్ చూసుకుంటుందని అన్నారు.
Hyderabad
India
Second Capital
Vidyasagar Rao
BJP

More Telugu News