Bapatla District: బాపట్లలో అమానుషం.. టెన్త్ విద్యార్థిపై పెట్రోలు పోసి నిప్పంటించిన స్నేహితుడు

10th Student killed by his friend in Bapatla District
  • రాజోలు పంచాయతీలోని ఉప్పలవారిపాలెంలో ఘటన
  • ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో పెట్రోలు పోసి నిప్పు పెట్టిన స్నేహితుడు
  • చికిత్స పొందుతూ మృతి చెందిన బాలుడు
ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న పదో తరగతి విద్యార్థిపై స్నేహితుడే పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. తీవ్రంగా గాయపడిన బాధిత విద్యార్థి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీలోని ఉప్పలవారిపాలేనికి చెందిన ఉప్పల అమర్నాథ్ స్థానికంగా పదో తరగతి చదువుతున్నాడు. ఈ ఉదయం ఎప్పట్లానే రాజోలులో ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో రెడ్లపాలెం వద్ద అమర్నాథ్ స్నేహితుడు వెంకటేశ్వర్‌రెడ్డి మరికొందరితో కలిసి అతడిపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. 

బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే మంటలు ఆర్పి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరికొందరితో కలిసి వెంకటేశ్వర్‌రెడ్డి తనపై పెట్రోలు పోసి నిప్పు అంటించినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అమర్నాథ్ చెప్పాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Bapatla District
10th Student
Andhra Pradesh

More Telugu News