Jagan: గుడివాడలో జగన్ కు నిరసన సెగ.. నల్లబెలూన్లను వదిలిన మహిళలు

Women protest against Jagan in Gudivada
  • టిడ్కో ఇళ్ల పరిశీలనకు గుడివాడకు వచ్చిన జగన్
  • ఆ ఇళ్లను చంద్రబాబు కట్టించారన్న మహిళలు
  • గో బ్యాక్ సీఎం, సైకో సీఎం అంటూ నినాదాలు

టిడ్కో ఇళ్ల పరిశీలన కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్ గుడివాడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు నిరసన సెగ తగిలింది. నల్ల బెలూన్లను వదిలి మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ సీఎం, సైకో సీఎం అంటూ నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేసిన మహిళలు మాట్లాడుతూ... చంద్రబాబు కట్టించిన 8,912 టిడ్కో ఇళ్లను చూసేందుకు రావడం లేదని, ఆయన తండ్రి వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వస్తున్నారని విమర్శించారు. జగన్ పర్యటనను నిరసిస్తూ చాలా మంది మహిళలు సభాస్థలికి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారని... అందుకే ఇక్కడి నుంచే నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. గోబ్యాక్ సీఎం, సైకో సీఎం అంటూ నల్ల బెలూన్లను గాల్లోకి వదిలారు. జగన్ హెలికాప్టర్ ఆ ప్రాంతంలోకి వచ్చిన సమయంలోనే బెలూన్లను ఎగురవేశారు. మరోవైపు జగన్ పర్యటన సందర్భంగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News