USA: భారత్‌లో వీలైనన్ని వీసా దరఖాస్తుల పరిష్కారమే మా లక్ష్యం: అమెరికా

US Making Huge Push to Process As Many Visa Applications As Possible In India
  • వీసా దరఖాస్తుల పరిష్కారానికి అమెరికా తీవ్రంగా కృషిచేస్తోందన్న విదేశాంగ శాఖ ప్రతినిధి
  • ఈ విషయంలో చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని స్పష్టీకరణ
  • భారత్‌తో అమెరికా భాగస్వామ్యాం ఇరు దేశాలకు కీలకమని వ్యాఖ్య
భారత్‌లో వీలైనన్ని వీసా దరఖాస్తులను పరిష్కరించేందుకు అమెరికా దౌత్య వర్గాలు తీవ్రంగా కృష్టి చేస్తున్నాయని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం పేర్కొన్నారు. ప్రధాని మోదీ త్వరలో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వీసా సమస్యల పరిష్కారానికే తమ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంలో చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని కూడా మాథ్యూ వ్యాఖ్యానించారు. భారత్‌తో అమెరికా భాగస్వామ్యం ఇరు దేశాలకు కీలకమని పేర్కొన్నారు. ఉమ్మడి లక్ష్యాల దిశగా అమెరికా, భారత్ కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. 

జూన్ 21-24 మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇది మోదీ తొలి అధికారిక అమెరికా పర్యటన. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ మోదీ కోసం అధికారిక విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు వీసాతో సహా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా నుంచి 31 సాయుధ ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది.
USA

More Telugu News