Upasana: పుట్టబోయే బిడ్డ కోసం... అత్తయ్య వాళ్లింటికి వెళ్లిపోతున్నాం: ఉపాసన

Upasana and Ram Charan will shift to Chiranjeevi house soon
  • గర్భం దాల్చిన ఉపాసన
  • త్వరలో బిడ్డకు జన్మనివ్వనున్న రామ్ చరణ్ అర్ధాంగి
  • బిడ్డకు గ్రాండ్ పేరెంట్స్ మమకారం అవసరం అన్న ఉపాసన
  • పిల్లల ఎదుగుదలలో గ్రాండ్ పేరెంట్స్ ఎంతో కీలకమని వెల్లడి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన గర్భవతి అని తెలిసిందే. ఇటీవల రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. త్వరలోనే తమ జీవితంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించబోతున్నారు. ఈ నేపథ్యంలో, ఉపాసన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తాము త్వరలోనే తమ అత్తయ్య గారింటికి వెళ్లిపోతున్నామని తెలిపారు. పుట్టబోయే బిడ్డ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్, తాను వేరే ఇంటిలో ఉంటున్నామని, అయితే, ఇకమీదట అత్తమామలతోనే ఉండాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. 

పిల్లల ఎదుగుదలలో గ్రాండ్ పేరెంట్స్ ప్రభావం కీలకం అని, తమ బిడ్డ కూడా అలాంటి వాతావరణంలో పెరగాలన్న ఉద్దేశంతోనే అత్తయ్య వాళ్లింటికి షిఫ్ట్ అవుతున్నట్టు ఉపాసన వివరించారు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి తాను, రామ్ చరణ్ ఎంతో నేర్చుకున్నామని, పుట్టబోయే తమ బిడ్డకు ఆ అవకాశాన్ని, ఆనందాన్ని దూరం చేయాలనుకోవడంలేదని తెలిపారు.
Upasana
Ram Charan
Chiranjeevi
Surekha
Hyderabad
Tollywood

More Telugu News