Emraan Hashmi: పవన్ కల్యాణ్ 'ఓజీ'లో విలన్ గా బాలీవుడ్ కిస్సర్

Emraan Hashmi acts as antagonist to Pawan Kalyan in OG
  • యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో పవన్ హీరోగా 'ఓజీ'
  • విలన్ గా ఇమ్రాన్ హష్మీ
  • అఫిషియల్ గా ప్రకటించిన డీవీవీ ఎంటర్టయిన్ మెంట్

సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం 'ఓజీ'. తాజాగా ఈ చిత్రంలో విలన్ ఎవరో తెలిసిపోయింది. బాలీవుడ్ సినిమాల్లో ముద్దు సీన్లకు పెట్టింది పేరైన ఇమ్రాన్ హష్మీ 'ఓజీ'లో విలన్ గా నటించనున్నాడు. 'ఓజీ'లో పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా శక్తిమంతుడైన దుష్టపాత్రలో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ వెల్లడించింది. ఇమ్రాన్ హష్మి... 'ఓజీ'లో పవన్ కల్యాణ్ కు బద్ధశత్రువు ఇతడే అని వివరించింది. ఈ మేరకు 'ఓజీ'లో ఇమ్రాన్ హష్మీ లుక్ ను కూడా పంచుకుంది. కాగా, ఈ చిత్రంలో నాని 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది.

  • Loading...

More Telugu News