YS Avinash Reddy: చంచల్ గూడ జైల్లో తండ్రి భాస్కర్ రెడ్డిని కలిసిన ఎంపీ అవినాశ్ రెడ్డి

MP Avinash Reddy met his father Bhaskar Reddy in Chanchalguda prison
  • వివేకా హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డి
  • చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భాస్కర్ రెడ్డి
  • ములాఖత్ లో భాగంగా తండ్రితో మాట్లాడిన అవినాశ్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి నేడు చంచల్ గూడ జైల్లో తండ్రి భాస్కర్ రెడ్డిని కలిశారు. ఇటీవల తండ్రి అస్వస్థతకు గురైన నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ములాఖత్ లో భాగంగా తండ్రిని కలిసేందుకు జైలు అధికారులు అవినాశ్ రెడ్డికి అనుమతి ఇచ్చారు. 

వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి కూడా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటికే పలుమార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇటీవలే న్యాయస్థానం అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
YS Avinash Reddy
Bhaskar Reddy
Chanchalguda Jail
YS Vivekananda Reddy
CBI
YSRCP

More Telugu News