PV Sindhu: పాపం పీవీ సింధు.. ఆమె చేతిలో మళ్లీ ఓటమే

PV Sindhu crashes out after losing to Tai Tzu Ying in Indonesia Open
  • ఇండోనేసియా ఓపెన్‌ లో ప్రిక్వార్టర్స్‌లోనే ఓటమి
  • తై జుయింగ్ చేతిలో సింధుకు పరాజయం
  • ఆమెతో 24 మ్యాచ్‌ ల్లో 19సార్లు ఓడిన తెలుగు షట్లర్
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో టోర్నమెంట్‌ లో నిరాశ పరిచింది. రెండుసార్లు ఒలింపిక్ విజేత అయిన సింధు ఇండోనేషియా ఓపెన్ సూపర్1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. మరోసారి చైనీస్ తైపీ షట్లర్ తై జుయింగ్ చేతిలో ఓడి నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో సింధు 18-21, 16-21 తేడాతో వరుస గేమ్స్ లో పరాజయం పాలైంది. 

ఇప్పటిదాకా తై జుయింగ్ తో 24 సార్లు పోటీ పడ్డ సింధుకు ఇది 19వ ఓటమి కావడం గమనార్హం. ఆమెపై కేవలం ఐదు సార్లు మాత్రమే గెలిచింది. సింధుపై గెలిచి క్వార్టర్  ఫైనల్ కు దూసుకెళ్లిన తై జుయింగ్.. స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌తో పోటీ పడనుంది.
PV Sindhu
Indonesia Open
lose

More Telugu News