Vijay Varma: తమన్నాతో అనుబంధంపై విజయ్ వర్మ స్పందన ఇదే..!

Vijay Varma reacts after Tamannaah confirms their relationship
  • సమయం రావాలన్న విజయ్ వర్మ
  • ప్రేమలో పూర్తిగా మునిగి ఉన్నట్టు పరోక్ష అంగీకారం
  • తాను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నట్టు వెల్లడి
తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్టు ఇటీవలే ప్రకటించింది. దీంతో తమన్నా ఎవరిని పెళ్లి చేసుకుంటుందన్న మిస్టరీ వీడింది. విజయ్ వర్మ, తన మధ్య ప్రేమ ఉన్న విషయం నిజమేనని తమన్నా అంగీకరించింది. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో వీరు తొలిసారి కలసి నటించగా, ఆ సమయంలోనే ప్రేమ చిగురించినట్టు చెప్పింది. సహ నటుడు అని కాకుండా తమ మధ్య స్వచ్ఛమైన అనుబంధం ఏర్పడినట్టు వివరించింది. తన మనసుకు దగ్గరయ్యాడని, తనకు అండగా నిలబడతానే నమ్మకం ఏర్పడినట్టు వివరించింది. అతడు ఉన్న చోట తనకు సంతోషం ఉంటుందని తెలిపింది.

తమన్నా వ్యాఖ్యల నేపథ్యంలో వ్యక్తిగత జీవితంపై మాట్లాడాలని విజయ్ వర్మను ఓ మీడియా సంస్థ కోరింది. వ్యక్తిగత జీవితం గురించి అభిమానులు తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉన్నారని పేర్కొనగా.. ప్రేమలో ఉన్నట్టు పరోక్షంగా అంగీకరించాడు. ‘‘సరైన సమయం వచ్చినప్పుడు మీరు దాని గురించి మాట్లాడండి. నా జీవితం ఇప్పుడు ఎంతో ప్రేమతో నిండింది. నేను ఎంతో సంతోషంగా ఉన్నాననే చెప్పగలను’’ అని విజయ్ వర్మ స్పందించాడు. తన వ్యక్తిగత జీవితం కంటే తాను చేసే పనులే మాట్లాడాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నాడు.
Vijay Varma
Tamannaah
relationship
reaction

More Telugu News