Team India: భారత జట్టుది అహంకారం.. అతి విశ్వాసం: వెస్టిండీస్ లెజెండరీ బౌలర్

Windies legend accuses Indian cricket of arrogance superiority complex
  • భారత జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారన్న యాండీ రాబర్ట్స్
  • స్వదేశం వెలుపల వారు మంచిగా రాణించింది లేదన్న అభిప్రాయం
  • టెస్ట్ క్రికెట్టా, టీ20నా ఏదన్నది తేల్చుకోవాలంటూ సలహా

భారత క్రికెట్ జట్టుపై వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ యాండీ రాబర్ట్స్ తీవ్ర విమర్శలు చేశాడు. ఇటీవలే ఆస్ట్రేలియా చేతిలో టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఓటమి పాలైన భారత జట్టును టార్గెట్ చేశాడు. భారత జట్టుది అహంకారం, అతి నమ్మకమంటూ ఏకిపారేశాడు. ‘‘భారత క్రికెట్ లోకి ఈ అహంకారం ప్రవేశించింది. మిగతా ప్రపంచాన్ని భారత్ తక్కువ అంచనా వేసింది. టెస్ట్ క్రికెట్టా లేక పరిమిత ఓవర్ల క్రికెట్టా దేనిపై తమ ఫోకస్ అనేది భారత జట్టు తేల్చుకోవాలి. టీ20 క్రికెట్ అనేది తన పంథాలో అది సాగిపోతుంది. అక్కడ బ్యాట్, బాల్ మధ్య పోటీ నడవదు’’ అని రాబర్ట్స్ పేర్కొన్నాడు. 

భారత్ తన బ్యాటింగ్ బలాన్ని చూపిస్తుందని నేను అనుకున్నాను. అజింక్య రహానే ఒక్కడే గట్టిగా పోరాడినప్పటికీ భారత్ నుంచి ఎలాంటి అనుకూలతలు కనిపించలేదు. శుభ్ మన్ గిల్ కు బలమైన చేతులు ఉన్నప్పటికీ బాల్స్ కు దొరికిపోతున్నాడు. భారత్ లో చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ స్వదేశం వెలుపల వారు ఏమీ చెప్పుకోతగ్గ ప్రదర్శన ఇవ్వలేదు’’ అని యాండీ రాబర్ట్స్ తన విశ్లేషణను ఓ మీడియా సంస్థతో పంచుకున్నాడు.

  • Loading...

More Telugu News