Devon Conway: ధోనీతో సమయం గడపడం నా అదృష్టం: డెవాన్ కాన్వే

MS Dhoni gives me a lot of banter Devon Conway spills the beans on relationship with CSK captain
  • ధోనీ తనను ఆటపట్టిస్తున్నాడన్న కాన్వే
  • తాను కూడా ఇప్పుడు అదే చేస్తున్నట్టు వెల్లడి
  • ధోనీ రూమ్ లోకి వస్తే అక్కడ వెలుగు వచ్చినట్టు ఉంటుందని వ్యాఖ్య

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్, న్యూజిలాండ్ జట్టు క్రికెటర్ అయిన డెవాన్ కాన్వే, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో తన అనుబంధం ఎలాంటిదో మీడియాతో పంచుకున్నాడు. తాను, ధోనీ ఎప్పుడూ చమత్కరించుకుంటూ, సరదాగా ఉంటామని చెప్పాడు. ధోనీ ఎక్కడ అంటే అక్కడ అతడి చుట్టూ ఏదో మ్యాజిక్ ఉంటుందన్నాడు. 2023 సీజన్ లో సీఎస్కే ఓపెనర్ గా కాన్వే రాణించడం తెలిసిందే. 

‘‘ధోనీతో ఎంతో సమయం గడిపే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. మోయిన్ అలీ, ఎంఎస్ ధోనీ, అజింక్య రహానే, నేను కలసి టీమ్ రూమ్ లో ఎంతో సమయం గడిపాం. ఐపీఎల్ గేమ్స్ చూస్తూ, వివిధ జట్లు, వ్యూహాల గురించి మాట్లాడుకునే వాళ్లం. క్రికెట్ కాకుండా వేరే విషయాలు కూడా చర్చకు వచ్చేవి. 

ఎంఎస్ ధోనీతో నా అనుబంధం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎంతో సరదాగా మాట్లాడతాడు. ఆటపట్టిస్తుంటాడు. నేను కూడా ఇప్పుడు అలాగే చేయడం మొదలు పెట్టాను. అతడు అంటే ఎంతో గౌవవం. డ్రెస్సింగ్ రూమ్ లోకి ధోనీ వచ్చిన ప్రతిసారీ అక్కడ ప్రకాశవంతంగా ఉంటుంది. అతడితో మాట్లాడి, అతడు ఏం చెబుతున్నాడో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే క్రికెట్ లో అతడు ఏం సాధించాడో అందరికీ తెలుసు. అర్ధరాత్రి, ఉదయాన్నే స్నూకర్ ఆడేవాళ్లం’’ అని కాన్వే వివరించాడు.

  • Loading...

More Telugu News