Ambati Rambabu: జగన్ కు పవన్ కల్యాణ్ సవాల్ విసరడంపై అంబటి రాంబాబు కౌంటర్

Ambati Rambabu satires on Pawan Kalyan over his remarks on Jagan
  • తాను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా జగన్ ఎలా అడ్డుకుంటారో చూస్తానన్న పవన్
  • కేవలం ఎమ్మెల్యే కావడం కోసం పార్టీ పెట్టడం ఎందుకన్న అంబటి
  • రాజకీయం అంటే ఏమిటో పవన్ నేర్చుకోవాలని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. పవన్ వారాహి యాత్ర నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం కత్తిపూడిలో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో తాను అడుగుపెట్టకుండా జగన్ ఎలా అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు. 

పవన్ వ్యాఖ్యలపై అంబటి స్పందిస్తూ... కేవలం ఎమ్మెల్యే కావడం కోసం పార్టీని పెట్టడం ఎందుకని సెటైర్ వేశారు. వారాహి వాహనానికి ఎన్నిసార్లు పూజలు చేస్తారని, అదేమైనా యుద్ధ ట్యాంకా అని ఎద్దేవా చేశారు. రాజకీయం అంటే ఏమిటో పవన్ కల్యాణ్ నేర్చుకోవాలని చెప్పారు. కేంద్రంలోని బీజేపీని ఒప్పించి కాపులకు రిజర్వేషన్లను ఇప్పించాలని అన్నారు. కాపులకు రిజర్వేషన్లను ఇవ్వని చంద్రబాబుతో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు.
Ambati Rambabu
Jagan
YSRCP
Pawan Kalyan
Janasena

More Telugu News