Stalin: స్టాలిన్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. తమిళనాడులోకి సీబీఐకి నో ఎంట్రీ!

Tamil Nadu government withdraws general consent for CBI
  • సీబీఐకి జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకున్న డీఎంకే ప్రభుత్వం
  • రాష్ట్రంలో ఏ కేసు దర్యాఫ్తు చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి
  • పదో రాష్ట్రంగా జాబితాలో చేరిన తమిళనాడు
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐకి జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకుంది. ఇక నుండి ఈ రాష్ట్రంలో ఏ కేసునైనా దర్యాఫ్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. గతంలో తెలంగాణ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్నాయి.

తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం సీబీఐకి తలుపులు మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు సీబీఐకి జనరల్ కన్సెంట్ ను ఉపసంహరించుకున్నాయి. ఇందులో తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, కేరళ, ఝార్ఖండ్, పంజాబ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు పదో రాష్ట్రంగా ఈ జాబితాలో చేరింది.
Stalin
Tamilnadu

More Telugu News