dgca: చైనా సరిహద్దుకు 50 కి.మీ. దూరంలోని ఉత్తరాఖండ్ విమానాశ్రయానికి డీజీసీఐ అనుమతి

  • దేశంలోని ఇతర ప్రాంతాల నుండి విమాన కార్యకలాపాలు
  • ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహణలో నైనిసైని విమానాశ్రయం
  • డీజీసీఏ అనుమతిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హర్షం
50km from China border Naini Saini airport in Uttarakhand gets DGCA nod

చైనా సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరాఖండ్ లోని పిథోర్‌ఘర్... నైనిసైని విమానాశ్రయానికి డీజీసీఏ అనుమతి లభించింది. దీంతో మిగతా భారత్ విమానాశ్రయాల నుండి ఉత్తరాఖండ్ లోని ఈ కొండ ప్రాంతానికి విమాన కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ విమానాశ్రయానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా ఏరోడ్రమ్ లైసెన్స్ ను ఇచ్చింది. ఈ విమానాశ్రయాన్ని ప్రస్తుతం ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహిస్తోంది.

డీజీసీఏ అనుమతిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దమానీ మాట్లాడుతూ... ఉత్తరాఖండ్ తో ముఖ్యంగా కుమాన్ జిల్లాతో కనెక్టివిటీకి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర విమానయాన శాఖ మంత్రికి ఇందుకు ధన్యవాదాలు చెప్పారు.

అంతకుముందు ఉత్తరాఖండ్ కేబినెట్ ఈ సైనిసైని విమానాశ్రయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విమానాశ్రయాన్ని 1991లో నిర్మించారు. పరిపాలనా సంబంధ వినియోగం కోసం దీనిని నిర్మించారు. 2019లో తొమ్మిది సీట్ల కమర్షియల్ విమానాన్ని ఇక్కడి నుండి ప్రారంభించారు. అయితే మార్చి 2020లో సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో దీనిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

More Telugu News