adipurush: ఆదిపురుష్ సినిమా టిక్కెట్ ధర పెంపుకు ఏపీ అనుమతి.. స్పెషల్ షోలకు మాత్రం నో

Adipurush ticket hike in Andhra Pradesh for ten days
  • సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్‌పై రూ.50 పెంపుకు అనుమతి
  • సినిమా విడుదలైన నాటి నుండి పది రోజుల పాటు పెరిగిన ధరలు
  • 3డీ గ్లాసులకు ప్రత్యేక ఛార్జీ వసూలు
ప్రభాస్ కీలకపాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమా టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిచ్చింది. ఈ మేరకు తాజాగా జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ లలో టిక్కెట్‌పై రూ.50 పెంచుకోవడానికి పచ్చజెండా ఊపింది. సినిమా విడుదలైన నాటి నుండి పది రోజుల పాటు ఈ ధరలు ఉంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం టిక్కెట్ ధర రూ.115 కాగా, అదనంగా రూ.50 చెల్లించాలి. మల్టీప్లెక్స్‌లలో రూ.177 ఉంది. దీనికి కూడా రూ.50 అదనంగా చెల్లించాలి. 3డీ గ్లాసులకు ప్రత్యేకంగా ఛార్జీ వసూలు చేస్తారు. ఏపీలో స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వలేదు. ఆదిపురుష్ సినిమా టిక్కెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ స్పెషల్ షోలకు కూడా అనుమతి నిచ్చింది.
adipurush
Prabhas
Andhra Pradesh

More Telugu News