pfi: నిజామాబాద్ కుట్ర కేసు: కర్ణాటకలో పీఎఫ్ఐ మాస్టర్ వెపన్ ట్రైనర్ అరెస్ట్

NIA Arrests PFI Master Weapons Trainer In Karnataka
  • తెలుగు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చిన యూనస్
  • నంద్యాల కేంద్రంగా కార్యకలాపాలు
  • 2022లో ఎన్ఐఏ సోదాల సమయంలో బళ్లారికి పారిపోయిన యూనస్
  • బషీర్ గా పేరు మార్చుకొని ప్లంబర్ గా పని చేస్తూ ఉగ్రమూకలతో లింక్
పీఎఫ్‌ఐ కీలక నేత మహ్మద్ యూనస్‌ను కర్ణాటకలో ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌ కుట్ర కేసులో యూనస్‌ నిందితుడిగా ఉన్నాడు. పీఎఫ్‌ఐలో ఆయుధ శిక్షకుడిగా వ్యవహరించిన యూనస్‌, తెలుగు రాష్ట్రాల్లో పీఎఫ్‌ఐ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. గతంలో నంద్యాల కేంద్రంగా కార్యకలాపాలు జరిపిన యూనస్‌, 2022లో ఎన్‌ఐఏ సోదాలు సమయంలో కర్ణాటకలోని బళ్లారికి పారిపోయాడు. అక్కడ బషీర్‌గా పేరు మార్చుకుని, షేక్‌ ఇలియాస్‌ అనే మరో వ్యక్తితో కలిసి పీఎఫ్‌ఐ సభ్యులకు ఆయుధ శిక్షణ ఇచ్చాడు. ఇలియాస్‌ పరారీలో ఉన్నాడు.

నిజామాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో గతంలో నమోదైన కేసు ఆధారంగా ఎన్ఐఏ అధికారులు మరో కేసును నమోదు చేసి, పీఎఫ్ఐపై దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేశారు. అందరిపై ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వారు ఇచ్చిన సమాచారంతో యూనస్ ను కర్ణాటకలో అరెస్ట్ చేసింది. యూనస్ గతంలో నంద్యాలలో తన సోదరుడికి చెందిన ఇన్వర్టర్ దుకాణంలో పని చేశాడు. 2022లో ఎన్ఐఏ సోదాల సమయంలో బళ్లారికి పారిపోయాడు. అక్కడ బషీర్ గా పేరు మార్చుకొని ప్లంబర్ గా పని చేస్తూ ప్రత్యేక కోడ్ భాషలో ఉగ్రవాదులతో సంభాషణలు జరుపుతున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.
pfi
nia
Karnataka
Nizamabad District

More Telugu News