Kottu Satyanarayana: మోదీ, అమిత్ షా మధ్య విభేదాలు ఉన్నాయి: ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

There are differences between Modi and Amit Shah says Kottu Satyanarayana
  • జగన్ ను మోదీ ఒక్క మాట కూడా అనడం లేదన్న సత్యనారాయణ
  • అమిత్ షా, నడ్డాలు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపాటు
  • జగన్ పై నమ్మకంతోనే ఏపీకి కేంద్రం రూ. 23 వేల కోట్లను ఇచ్చిందని వ్యాఖ్య
బీజేపీని టార్గెట్ చేస్తూ ఏపీ మంత్రులు, నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల మధ్య విభేదాలు ఉన్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోదీ ఒక్క మాట కూడా అనడం లేదని... కానీ అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు మాత్రం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై వీరిద్దరూ చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. 

జగన్ ను అనేక సందర్భాల్లో మోదీ మెచ్చుకున్నారని సత్యనారాయణ అన్నారు. జగన్ మీద, వైసీపీ ప్రభుత్వం మీద నమ్మకంతోనే కేంద్ర ప్రభుత్వం రూ. 23 వేల కోట్లను విడుదల చేసిందని చెప్పారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఎన్నిసార్లు అడిగినా మోదీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. జగన్ పై మోదీకి ఎంత నమ్మకం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పారు.
Kottu Satyanarayana
Jagan
Narendra Modi
Amit Shah
JP Nadda
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News