Shah Rukh Khan: షారూక్ ఖాన్ కు ముద్దు పెట్టేసిన మహిళా అభిమాని

Woman kisses Shah Rukh Khan at Dubai event upset fans say put her in jail
  • దుబాయిలో చోటు చేసుకున్న ఘటన
  • తన స్నేహితుడి రియల్ ఎస్టేట్ బ్రాండ్ ప్రచారానికి వెళ్లిన షారూక్
  • మహిళ చేసిన పనిపై మండిపడుతున్న అభిమానులు
అభిమానులు ఒక్కోసారి తమకిష్టమైన సెలబ్రిటీ కనిపించినప్పుడు వళ్లు తెలియకుండా ప్రవర్తిస్తారు. ఓ మహిళ కూడా ఇప్పుడు అలాగే చేసింది. షారూక్ ఖాన్ కు నలుగురిలో గట్టిగా ముద్దు పెట్టేసింది. మంగళవారం దుబాయిలోని ఓ కార్యక్రమానికి షారూక్ ఖాన్ వెళ్లిన సందర్భంగా ఇది చోటు చేసుకుంది.  

తన స్నేహితుడి రియల్ ఎస్టేట్ బ్రాండ్ ప్రచార కార్యక్రమం కోసం షారూక్ ఖాన్ దుబాయి వెళ్లారు. అదే కార్యక్రమానికి వచ్చిన కొంత మంది అతిథులు, అభిమానులతోనూ ఆయన ముచ్చటించారు. అత్యుత్సాహంగా ఉన్న ఓ మహిళ షారూక్ ఖాన్ ను రెండు చేతులతో పట్టుకుని బుగ్గపై ముద్దాడింది. అనంతరం పట్టరాని ఆనందంతో నవ్వేసింది. ఆ సమయంలో షారూక్ ఖాన్ బాడీ గార్డులు, ఆయన మేనేజర్ పూజా దద్లానీ కూడా అక్కడే ఉన్నారు. నేను ఒక ముద్దు ఇవ్వొచ్చా? అని ప్రశ్నించి, షారూక్ స్పందించే లోపే ఆమె తన కోరిక తీర్చేసుకుంది. షారూక్ చేసేదేమీ లేకుండా స్వీకరించారు.

కాకపోతే ఈ చర్య షారూక్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. బాలికను జైల్లో వేయాలి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆమె చేసినట్టుగా, ఓ మధ్య వయసు వ్యక్తి మాధురి లేదంటే శ్రీదేవి లేదంటే కరీనాని ముద్దాడి అక్కడి నుంచి వెళ్లగలరా? అంటూ ఓ యూజర్ సందేహం వ్యక్తం చేశాడు. 
Shah Rukh Khan
Dubai event
woman kisses

More Telugu News