Apple: అతి తక్కువ ధరకు యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ఎం1

Apple MacBook Air M1 selling at under Rs 75000
  • దీని అసలు ధర రూ.99,990
  • 20 శాతం డిస్కౌంట్ ఆఫర్
  • హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్, డెబిట్ కార్డుపై మరో రూ.5,000 డిస్కౌంట్
  • రూ.74,990కే సొంతం చేసుకోవచ్చు

యాపిల్ మ్యాక్ బుక్ ల్యాప్ టాప్ అంటే ఇష్టపడని వారుండరు. నాణ్యత, సౌకర్యం, సెక్యూరిటీ పరంగా మన్నికైన ఉత్పత్తి ఇది. అందుకే ఇతర ల్యాప్ టాప్ లతో పోలిస్తే ధర ఎక్కువగా ఉంటుంది. అయితే కాస్త తక్కువ ధరలో రావాలనుకుంటే, అమెజాన్ యాపిల్ డేస్ సేల్ లో ఆఫర్లను పరిశీలించొచ్చు. 

మ్యాక్ బుక్ ఎయిర్ ఎం1 అనేది యాపిల్ ల్యాప్ టాప్ లలో తక్కువ ధరకు లభిస్తుంటుంది. ఇప్పుడు ఆఫర్ లో భాగంగా ఈ ధర ఇంకా తగ్గింది. ఈ ఉత్పత్తి విడుదలైన తర్వాత ఇంత తక్కువ ధరకు రావడం ఇదే మొదటిసారి. మ్యాక్ బుక్ ఎయిర్ ఎం1 అసలు ధర రూ.99,990. ఆఫర్ లో భాగంగా 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ధర రూ.79,990కు దిగొచ్చింది. ఇక హెచ్ డీఎఫ్ సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.5,000 డిస్కౌంట్ కూడా సొంతం చేసుకోవచ్చు. దీంతో కేవలం రూ.74,990కే ఇది లభిస్తుంది. 13.3 అంగుళాల ఎల్ఈడీ స్క్రీన్ సైజుతో ఈ ల్యాప్ టాప్ వస్తుంది.

  • Loading...

More Telugu News