Shirtless officer: యూపీలో ఉన్నతాధికారి సమీక్ష సమావేశానికి షర్ట్ లేకుండా వచ్చిన ఉద్యోగి

Shirtless UP education dept officer attends meeting gets suspended
  • బనియన్ వేసుకుని హాజరైన ఆఫీసర్
  • అసౌకర్యానికి గురైన తోటి ఉద్యోగులు
  • సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన ఉన్నతాధికారులు
ఉద్యోగం పట్ల అంకిత భావం లేకుండా, నిర్లక్ష్యం ప్రదర్శించిన ఓ ఉద్యోగిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉన్నతాధికారి నిర్వహించిన సమావేశానికి షర్ట్ లేకుండా ఓ ఉద్యోగి హాజరవ్వడమే వివాదానికి కారణంగా ఉంది. మంగళవారం విద్యా శాఖ డైరెక్టర్ జనరల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

జిల్లాల వారీగా, విద్యా శాఖ చేపట్టిన కార్యక్రమాల పురోగతిపై ఆయా జిల్లాల అధికారులతో డైరెక్టర్ జనరల్ విజయ్ కిరణ్ ఆనంద్ సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి ఇతరుల మాదిరే ఓ అధికారి కూడా వచ్చి కూర్చున్నారు. తీరా చూస్తే వంటిపై షర్ట్ లేదు. బనియన్ మాత్రం వేసుకున్నాడు. దీంతో చుట్టుపక్కల అధికారులు అసౌకర్యానికి గురయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత ఉన్నతాధికారులు ఈ చర్యను సీరియస్ గా పరిగణించారు. సదరు అధికారిని సస్పెండ్ చేశారు. దీనిపై విద్యా శాఖ విచారణ కూడా ప్రారంభించింది.
Shirtless officer
Uttar Pradesh
suspended
education dept

More Telugu News